అమలాపురం: లక్ష డప్పులు.. వేల గొంతుల సభకు పిలుపు

59చూసినవారు
అమలాపురం: లక్ష డప్పులు.. వేల గొంతుల సభకు పిలుపు
ఎస్సీ వర్గీకరణ అమలుపై ఈనెల 7న హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం నడిపూడిలో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ భవనంలో మాదిగల ఆత్మీయ సమావేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రమేష్ అధ్యక్షతన జరిగింది. మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడంపై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్