స్వర్ణాంధ్ర విజన్- 2024 డాక్యుమెంట్లో ప్రధాన సూత్రమైన జీరో ప్రోవర్టి లక్ష్యాన్ని సాధించేందుకు పేదరికంలో ఉన్నవారిని గుర్తించేందుకు చట్టబద్ధమైన సర్వేను నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.