అమలాపురం: అధికారులు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్

50చూసినవారు
కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో ఇసుక త్రవ్వకాలకు అనువైన రీచ్లను గుర్తించి అనుమతులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పట్టా భూముల్లో ఇసుక మేటల తవ్వకాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టగా వచ్చిన నివేదికను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్