అమలాపురం: మోకాళ్ళపై నిల్చుని సీహెచ్ఓల నిరసన

83చూసినవారు
సీహెచ్ఓలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కోనసీమ కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న తమ జీతాలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్ స్కీంను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ నిరసన కొనసాగిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్