అమలాపురం: ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతను జీవనశైలిలో ఒక భాగంగా అలవర్చుకునే దిశగా అవగాహన పెంచుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి సూచించారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాలను సిబ్బందితో సహా నిర్వహించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.