అమలాపురం: ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని మరింత పెంచాలి

58చూసినవారు
అమలాపురం: ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని మరింత పెంచాలి
విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ గురువారం భేటీ అయ్యారు. కోనసీమలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని మరింత పెంచాలని మంత్రిని కోరారు. ఇప్పటికే 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించిన కొనుగోలు లక్ష్యాన్ని, రైతుల ఆర్థిక భద్రత కోసం మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అవసరం ఉందని సూచించారు. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని హరీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్