అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో ఒక వైన్ షాప్ వద్ద శనివారం రాత్రి భారీ గోధుమ త్రాచు హల్చల్ చేసింది. వెంటనే అక్కడి వ్యక్తులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాము చాలా పెద్దదని, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని అన్నారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో దానిని వదిలిపెట్టారు.