ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమలాపురంకు చెందిన బండారు రామ్మోహన్ రావు నామినేషన్ వేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఒక సెట్ నామినేషన్ శుక్రవారం దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ. సుదీర్ఘకాలం పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలుపై పోరాడిన అనుభవం తనకు ఉందన్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.