విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద ఆయన ఆర్డీవో మాధవితో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార పదార్థాల రుచి గురించి ఆయన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.