ప్రపంచంలోని అంధులందరికి అక్షర జ్ఞానాన్ని లూయిస్ బ్రెయిలీ ప్రసాదించి బావ ప్రకటన భావవ్యక్తీకరణకు అవకాశం కల్పించారని కోనసీమ జిల్లా ఇన్ఛార్జి డిఆర్ఎ మాధవి అన్నారు. అమలాపురంలోని అంబేడ్కర్ భవన్ వద్ద లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదినాన్ని పురస్కరించుకుని అధికారులు అంతర్జాతీయ విభిన్న అంధుల ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బ్రెయిలీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.