ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను అరెస్టు చేసినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మంగళవారం అమలాపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజోలులో గత నెల 23న రిటైర్డ్ టీచర్ బాపన్న గుప్త ఇంట్లో జరిగిన చోరీ కేసులో రూ. 40 లక్షల బంగారం, 5, 925 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పా. గో జిల్లాకు చెందిన వారని, వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.