అల్లవరం మండలం అల్లవరం గ్రామపంచాయతీలో సచివాలయ ఉద్యోగి ఈశ్వర్ మానవత్వం చాటుకున్నారు. పెన్షన్ దారుడు ఆరోగ్యం బాగోలేక కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగి ద్విచక్ర వాహనంపై 60 కిలోమీటర్లు మేర వెళ్లి గురువారం పెన్షన్ అందజేశారు. దాంతో పెన్షన్ దారు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.