ఉప్పలగుప్తం. గొల్లవిల్లి అమృత్ రోవర్ వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని సర్పంచ్ జొన్నాడ శ్రీదుర్గ ఎగురవేశారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని ప్రతి ఒక్కరూ జాతీయ భావం కలిగి ఉండాలని సర్పంచ్ శ్రీ దుర్గా కోరారు. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చీకట్ల ఏసుబాబు, మద్ధింశెట్టి సీతారామ స్వామి, జొన్నాడ చిన్ని, ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బంది ఉపాధి కూలీలు పాల్గొన్నారు.