అమలాపురం బాలయోగి స్టేడియంలో గురువారం ఉదయం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ జెండాను గురువారం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరూ దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వేడుకలలో భాగంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎంపీ హరీష్ మాధుర్, కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.