స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శన గురువారం ఆకట్టుకుంది. ఉచిత ఇసుక విధానం, చంద్రన్న పింఛన్ కానుక, అన్న క్యాంటీన్, ఉపాధి పథకం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వంటి శకటాలను ప్రదర్శించారు. కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్ పాల్గొన్నారు.