అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ అరుణ కుమారి, ఉప సర్పంచ్ భాస్కరరావు పూలమాలతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి సత్కరించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి సూపరాజు, ఆదినారాయణ, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.