ఉప్పలగుప్తం: ముద్రగడ ఇంటిపై దాడి హేయమైన చర్య

84చూసినవారు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యని ఉప్పలగుప్తం మండలానికి చెందిన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పలగుప్తంలో మంగళవారం జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు ఒంటెద్దు వెంకన్న నాయుడు, సలాది సతీష్, దంగేటి రాంబాబు, చీకట్ల కిషోర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా వైసీపీ శ్రేణులపై కేసులు పెడుతూ వేధిస్తుందన్నారు. వీటిని సంఘటితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్