డోన్: ప్రమాదవశాత్తు గడ్డివామి దగ్ధం.. రూ. లక్ష నష్టం

59చూసినవారు
డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్. బుక్కాపురం గ్రామంలో ఆదివారం వెంకట్రాముడు అనే రైతుకు చెందిన గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆపలేకపోయారు. ఈ ప్రమాదం వల్ల సుమారు లక్ష రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని బాధిత రైతు వెంకట్రాముడు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్