అయినవిల్లి: రూ 30 లక్షలు విలువైన శఠారి బహుకరణ

75చూసినవారు
కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు కుటుంబ సభ్యులు అయినవిల్లి మండలం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారికి భారీ విరాళం అందించారు. రూ. 30 లక్షలు రూపాయలు విలువ కలిగిన 369 గ్రాముల బంగారు శఠారిని ఆదివారం స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, దాతలను శేష వస్త్రములతో సత్కరించి, వేద ఆశీర్వచనం అందజేసారు.

సంబంధిత పోస్ట్