అయినవిల్లి మండలం సిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాసరావు విద్యా కమిటీ ఛైర్మన్లకు, ప్రధానోపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ ఛైర్మన్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేయందుకు కృషి చేయాలన్నారు.