అంబాజీపేట మండలం ముక్కామల-ఈదరపల్లి ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వక్కలంకకు చెందిన సతీష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నెల 15న తన ద్విచక్ర వాహనంపై ముక్కామల నుంచి ఇంటికి వెలుతున్న సమయంలో ఆర్టీసీ బస్సును తప్పించే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలైనట్లు అంబాజీపేట ఎస్సై చిరంజీవి శుక్రవారం తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.