లంక గ్రామాలలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

76చూసినవారు
వరద ముంపునకు గురైన పి. గన్నవరం మండలం కె. ఏనుగుపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ బంగారు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య సిబ్బంది ముమ్మరంగా బ్లీచింగ్ చల్లారు. దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రజలు అందరూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్