పి. గన్నవరంలో కూటమి నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సమావేశం బుధవారం జరిగింది. సీఎం చంద్రబాబును మాత్రమే పొగుడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.