మామిడికుదురు: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ

79చూసినవారు
మామిడికుదురు: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన విజయ కనకదుర్గ గంగాభవాని మెడలోని 21 గ్రాముల పుస్తెలతాడును అపహరించారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారని ఎస్ఐ చైతన్య కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం యూనియన్ బ్యాంకు పక్క రోడ్లో వాకింగ్ చేస్తున్న గంగాభవాని మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్