గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి తూర్పుగోదావరి మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. మామిడికుదురు మండలం మగటపల్లిలో పంట కాలువ అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. మగటపల్లి పాలెంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గోగన్నమఠం మెయిన్ రోడ్డు వరకూ పంట కాలువను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.