మామిడికుదురు మండలం బి. దొడ్డవరానికి చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం ఝాన్సీ (14) ఓ గొలుసు విషయమై ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. ఝాన్సీ తన స్నేహితురాలితో బంగారు గొలుసు విషయమై వివాదం జరిగింది. శనివారం ఝాన్సీని ఆమె తల్లి సత్య నారాయణమ్మ మందలించడంతో మనస్తాపం చెంది గోదావరిలో దూకింది. బాలిక మృతదేహం అప్పనపల్లిలో సోమవారం లభ్యమయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ వివరించారు.