ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కోరారు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కళాశాలలు ఉన్నత పాఠశాలలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు మొల్లేటి శ్రీనివాస్, బోనం బాబు, చుట్టగుల్ల కిషోర్ ప్రచారంలో పాల్గొన్నారు.