మామిడికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ ఏసుబాబు, హెచ్ఎం నిరంజని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాంబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు వరప్రసాద్, సత్యనారాయణ సహకారంతో కళాశాలలు అభివృద్ధి చేస్తామన్నారు.