అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం శివారు బొమ్మరాలతిప్ప వెళ్లేందుకు రహదారి మధ్యల మట్టిగుట్టలు ఉండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు వేసేందుకు గతంలో గుంతలు తవ్వి రోడ్డు మధ్యలోనే మట్టి వదిలేశారు. దీంతో రాత్రి సమయంలో వాహనదారులు గుట్టలపై పడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.