అయినవిల్లి మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి ఆదివారం హైందవ శంఖారావం బహిరంగ సభకు జై శ్రీరామ్ అంటూ హిందువులు భారీగా తరలి వెళ్లారు. ఈ సభ విజయవాడ కేసరపల్లిలో జరుగునని తెలిపారు. ఈ కార్యక్రమంలో 250 మంది స్వామీజీలు పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. హిందూ మతాన్ని కాపాడుకునేందుకే సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.