ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలియజేశారు. పి. గన్నవరం మండలం పి. గన్నవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద 37 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కూటమి నాయకులు ఉన్నారు.