పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పి. గన్నవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కూటమి నాయకులకు బుధవారం దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సత్య నారాయణ, అనందరావు, బుచ్చిబాబు, జోగేశ్వరరావు, జడ్పీ మాజీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.