అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం నుంచి తోత్తరమూడి వెళ్లే రహదారి మరమ్మతు పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఆయన గురువారం ఫోన్ లో మాట్లాడి నిర్లక్ష్యం వీడి వెంటనే రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సంక్రాంతి పండుగలోపు గుంతలు లేని రహదారులను ఏర్పాటు చేయాలని సూచించారు.