పరిసరాల పరిశుభ్రతపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అవగాహన కల్పించారు. పి. గన్నవరం మండలం వైవీపాలెం, పి. గన్నవరం, నాగుల్లంక గ్రామాలలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శనివారం పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీవో ప్రసాద్, సర్పంచ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.