పి. గన్నవరం మండలం లంకల గన్నవరం సర్పంచ్ రామకృష్ణ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం తాడేపల్లిగూడెం నుంచి వస్తుండగా బెల్లంపూడిలో పిట్స్ వచ్చి కాలువలో పడిపోయారు. కాలువలో మునిగి పోతుండగా స్థానికులు అతన్ని రక్షించారు. అతనికి సపర్యలు చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతన్ని పి. గన్నవరం సీహెచ్ సీకి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.