అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబును జనసేన పార్టీ నుంచి తొలగించాలని పార్టీ నాయకులు శుక్రవారం పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ మేడిద దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చంటిబాబు పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నారు. సర్పంచ్ బుచ్చిరాజు, మండల అధ్యక్షుడు రాజేష్, ఈశ్వర్, ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు.