పి. గన్నవరం మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాలు, ఇతర అమ్మవార్ల ఆలయాలు వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పరిష్కరించుకుని భక్తులతో కిటికిటలాడాయి. పి. గన్నవరంలోని అమలాపురం రోడ్డులో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు.