దేశం గర్వించదగిన సంఘ సంస్కర్తలలో జ్యోతిరావు ఫూలే ఒకరు అని అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసారు అని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ అన్నారు. మహత్మా జ్యోతిరావ్ ఫూలే 197 వ జయంతి ని పురస్కరించుకొని జగ్గంపేట ప్రభుత్వ హై స్కూల్లో వద్దగల మహత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి స్థానిక జనసేన నాయకులతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.