జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో గండేపల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు కుంచే రామకృష్ణ మనవరాలు డయానా మొదటి పుట్టినరోజు వేడుకలకు బుధవారం హాజరై చిరంజీవి డయానాకు ఆశీస్సులు అందించారు. అనంతరం కేశవరం టిడిపి కార్యాలయంలో జ్యోతుల నెహ్రూను కేశవరం గ్రామ టిడిపి అధ్యక్షులు కర్రీ తాతారావు, టిడిపి నాయకులు ఉండమట్ల సురేష్, ఉండమట్ల శ్రీను ఘనంగా సత్కరించారు.