జగ్గంపేటలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. అనంతరం జగ్గంపేట పంచాయతీ కార్యాలయంలో, అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, జెండా ఆవిష్కరణ గావించారు.