ఎస్సీ కులగణన సర్వే నివేదిక సంబంధించిన తుది జాబితాను వచ్చే నెల పదో తేదీ నాటికి సిద్ధం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో పలు అంశాలపై జరిగిన సమీక్ష కార్యక్రమాల్లో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ఎస్సీ కులగణన సర్వేకు సంబంధించి ఎవరి నుంచైనా ఎటువంటి అభ్యంతరాలను ఈనెల 31వ తేదీలోపు స్వీకరించాలని తెలిపారు.