మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ కుటుంబాలకు పని దినాలు కల్పించి, పనుల్లో పురోగతి కనబరచాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మండలం స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు ఇతర పనుల్లో పురోగతి చూపాలన్నారు.