ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు: కమిషనర్‌ వెల్లడి

59చూసినవారు
ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు: కమిషనర్‌ వెల్లడి
ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేల చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె. వెంకటరావు తెలిపారు. సోమవారం ఆయన నగరంలో విస్తృతంగా పర్యటించి వివిధ పనులను పర్యవేక్షించారు. సాలిడ్‌వేస్ట్, లిక్విడ్‌ వేస్ట్, డంపింగ్‌ యార్డులను సందర్శించారు. నగరంలో సేకరించిన చెత్తను తరలించే గార్భేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్