78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కాకినాడ రూరల్ సుందరయ్య కాలనీలో జాతీయ జెండాను మాజీ సైనికులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు ఎగర వేశారు. ఈ సందర్భంగా తిరుమల శెట్టి నాగేశ్వరరావు, రాజా మాట్లాడుతూ 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో వలస దేశంగా పాలించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి నిరసనగా కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన- పోరాటం నిర్వహించారన్నారు.