కాకినాడ రమణయ్యపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయంలో భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జెండా వందనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.