కాకినాడలోని గోకులంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు గోకులం నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం కాకినాడ అశోక్ నగర్ లోని గోకులంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కృష్ణ భగవానునికి నిర్వహించామన్నారు.