అపాయం ఎదురైతే సునాయాసంగా ఎదుర్కోవడానికి తోడ్పడేది కరాటే విద్య అని మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోటు క్లబ్ ఉద్యానవనంలో కరాటే శిక్షకులు ఎల్. సూర్య ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న బాల బాలికలకు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే శిక్షణ వలన బాల బాలికలకు జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మనోధైర్యం లభిస్తుందని అన్నారు.