ఆలమూరు: ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతపై జాగ్రత్తలు వహించాలి

83చూసినవారు
ఆలమూరు: ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతపై జాగ్రత్తలు వహించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ఏ. రాజు అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరులో శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం వద్ద శనివారం స్థానిక కూటమి నాయకులతో కలిసి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన కూలీలు ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత పనులు చేయడం మంచిదన్నారు.

సంబంధిత పోస్ట్