ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామంలో హైస్కూల్ వద్ద రూ 8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అలాగే గ్రామంలోరూ. 38. 9 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకుకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మెర్ల గోపాలస్వామి, వంటిపల్లి సతీష్, ఈదాల నల్లబాబు, దున్నే స్వామి నాయుడు, రాయుడు వెంకటస్వామి పాల్గొన్నారు.