నియోజకవర్గంలో అన్నదమ్ములు ఇరువురు ఇసుకను దోచేస్తున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం లో ఇసుక దోపిడీపై ఆంధ్రజ్యోతి పేపర్ లోశనివారం "జొన్నాడలో ఇసుక లూటీ"" అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు.